AP New Districts: జిల్లా కలెక్టర్లుగా దంపతులు..
AP New Districts: జిల్లా కలెక్టర్లుగా దంపతులు..

మందస, న్యూస్టుడే: శ్రీకాకుళం జిల్లా మందస మండలం పిడిమందస గ్రామానికి చెందిన శనాపతి ఢిల్లీరావు, ఆయన భార్య పి.ప్రశాంతి ఇద్దరూ రెండు జిల్లాలకు కలెక్టర్లుగా నియమితులవడంతో ఈ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వీరు అనుకున్నట్లుగా కలెక్టర్లుగా స్థిరపడ్డారు. 2006లో గ్రూప్-1లో ఎంపికై.. 2008లో ఢిల్లీరావు విజయనగరం, ప్రశాంతి పార్వతీపురం ఆర్డీవోలుగా విధుల్లో చేరారు. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఢిల్లీరావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా, ప్రశాంతి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరుగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.